: ప్యారాచ్యూట్ లోంచి దూకుతూ బుష్ 90వ పుట్టిన రోజు సంబరాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూహెచ్ బుష్ తన 90వ పుట్టిన రోజు సంబరాలను భిన్నంగా జరుపుకున్నారు. 6 వేల అడుగుల ఎత్తులో హెలికాప్టర్ లోంచి ప్యారాచ్యూట్ సాయంతో కిందకు దూకి మరీ ఆయన లేటు వయసులో సాహసం చేశారు. ఆయనకు మరో నిపుణుడు సాయంగా ప్యారాచ్యూట్ లో వచ్చారు. మైనేలోని బుష్ నివాసం నుంచి ఆయన్ను హెలికాప్టర్ పైకి తీసుకెళ్లి ప్యారాచ్యూట్ సాయంతో కిందకు వదిలిపెట్టగా ఆయన సురక్షితంగా కిందకు దిగి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకున్నారు.