: ఆ కార్చిచ్చు ఇంకా ఆరలేదు!
పశ్చిమ గోదావరి జిల్లాలో రగిలిన కార్చిచ్చు ఇంకా ఆరలేదు. టి.నర్సాపురం మండలంలోని బంధంచర్ల అటవీ ప్రాంతంలో నాలుగు రోజులుగా మంటలు ఎగసిపడుతున్నాయి. అడవి సమీపంలో ఉన్న జామాయిల్, పామాయిల్ తోటలకు మంటలు వ్యాపించాయి. అటు గుంటూరు జిల్లా పెదపులుగువారి పాలెం అటవీ ప్రాంతంలోనూ కార్చిచ్చు రగిలింది. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం స్పందించలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.