: హిందూపురంలో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన బాలయ్య
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అప్పుడే తన నియోజకవర్గ అభివృద్ధికోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి అక్కడే ఉంటున్న ఆయన ఈ రోజు పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాటిలో భాగంగా హిందూపురం నుంచి సోమందేపల్లి వరకు రూ.10 కోట్ల వ్యయంతో 25 కిలో మీటర్ల మేర చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. తర్వాత ప్రజలకు తాగునీరు కోసం వాటర్ ప్లాంటు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంతేగాక ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల తాగునీరు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ టీడీపీ నెరవేరుస్తుందని మరోమారు స్పష్టం చేశారు.