: గుంటూరులో పేలిన గ్యాస్ సిలిండర్
పాత గుంటూరులోని రాజగోపాల్ నగర్ లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగటంతో రెండు ఇళ్లు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలిస్తున్నారు. మొత్తం నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.