: ఎలాంటి ఆంక్షలు లేకుండా పంట రుణాలు మాఫీ చేస్తాం: కేసీఆర్


గవర్నర్ ప్రసంగంపై తెలంగాణ శాసనసభలో కేసీఆర్ మాట్లాడుతూ, ఎలాంటి ఆంక్షలు లేకుండా పంట రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. రైతులు చేసిన బంగారం రుణాలను కూడా మాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రుణ మాఫీతో 26 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ తెలిపారు. రుణమాఫీ కారణంగా 19 వేల కోట్ల రూపాయల రుణభారం ప్రభుత్వంపై పడుతుందని తెలిపిన కేసీఆర్, ప్రభుత్వంపై ఎంత భారం పడినా హామీలు నెరవేర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని అన్నారు.

  • Loading...

More Telugu News