: రోడ్డుకు అడ్డుగా ఉన్న ఆ నిర్మాణాలను తొలగించండి: జీహెచ్ఎంసీ కమిషనర్
మెట్రో రైలు, ట్రాఫిక్ ఉన్నతాధికారులతో కలిసి గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కమిషనర్ సోమేష్ కుమార్ పంజాగుట్ట ప్రధాన రహదారిలో పర్యటించారు. ఇరుకుగా ఉన్న రోడ్డును పరిశీలించిన కమిషనర్, పోచంబస్తీ వైపు రోడ్డుకు అడ్డుగా ఉన్న కొన్ని నిర్మాణాలను 12 అడుగుల వరకు తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ జితేందర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, మెట్రో రైలు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.