: ఫిఫా వరల్డ్ కప్ లో బ్రెజిల్ శుభారంభం


సాకర్ ప్రపంచకప్ లో ఆతిథ్య దేశం బ్రెజిల్ శుభారంభం చేసింది. కొయేషియాతో జరిగిన తొలి మ్యాచ్ లో 3-1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. 20వ నిమిషంలో క్రొయేషియా ఆటగాళ్లు బ్రెజిల్ గోల్ పోస్టువైపు దూసుకువచ్చారు. క్రొయేషియా ఆటగాడిని సమర్థవంతంగా అడ్డుకున్న బ్రెజిల్ డిఫెండర్లు అతని నుంచి బంతిని ఎగరేసుకుపోయే సందర్భంగా స్వంత గోల్ పోస్టులోకే బంతిని తన్ని సెల్ఫ్ గోల్ చేశారు. దీంతో క్రొయేషియాకు ఆధిక్యం లభించింది.

దానిని కాపాడుకునేందుకు క్రొయేషియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ 71వ నిమిషంలో బ్రెజిల్ ఆటగాడు నైమార్ తొలి గోల్ కొట్టి స్కొరు సమం చేశాడు. అనంతరం 91వ నిమిషంలో మరో ఆటగాడు ఆస్కార్ గోల్ కొట్టి బ్రెజిల్ కు ఆధిక్యం అందించాడు. అనంతరం మరోసారి నైమార్ గోల్ కొట్టి బ్రెజిల్ కు తిరుగులేని ఆధిక్యం అందించాడు. దీంతో బ్రెజిల్ 3-1 తేడాతో శుభారంభం చేసింది.

ఈ రోజు పీఫా వరల్డ్ కప్ లో మెక్సితో కామెరూన్, స్పెయిన్ తో నెదర్లండ్స్, చిలీతో ఆస్ట్రేలియా పోటీ పడనున్నాయి. స్పెయిన్, నెదర్లాండ్స్ మ్యాచ్ పై భారీ స్థాయిలో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. గత వరల్డ్ కప్ లో పోటీ పడిన స్పెయిన్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ హోరాహోరీ సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News