: తెలంగాణ ఇచ్చిన సోనియాకు ధన్యవాదాలు: కేసీఆర్


సోనియాగాంధీ వల్లే తెలంగాణ ఏర్పడిందని... సభాముఖంగా ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నానని టీ.సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా చాలా సహకరించారని చెప్పారు. దేశ వ్యాప్తంగా దాదాపు 33 పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు సహకారం అందించాయని... వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ రోజు తెలంగాణ శాసనసభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతిపక్షాల సూచనలను తప్పకుండా గౌరవిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభించలేదని... కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. పరిపాలనలో అన్ని పార్టీలను భాగస్వాములను చేస్తామని... అందరి సూచనలూ తీసుకుంటామని... ఏకపక్ష నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఏ ఒక్కరి సొంతం కాదని... ఉద్యమంలో అందరూ పాల్గొన్నారని తెలిపారు. ప్రస్తుత ఉద్యమానికి తాను సారథ్యం వహిస్తే... నా కన్నా ముందే ఎంతో మంది ఉద్యమంలో తమదైన పాత్ర పోషించారని చెప్పారు.

  • Loading...

More Telugu News