: కేసీఆర్ నోట.. కేజీ, పీజీ మాట!


తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు నేడు తెలంగాణ అంశంపై మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైతే, కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య అందిస్తామని చెప్పారు. ఈ విధానాన్ని నిర్బంధంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కులాల వారీగా ఉన్న విద్యార్థి వసతి గృహాలను రద్దు చేసి, అన్ని కులాల వారికి ఒకే విధమైన హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణపై అటోఇటో తేల్చుకునే సమయం ఇదేనని చెబుతూ, బానిస బ్రతుకులు పోవాలంటే ప్రత్యేక రాష్ట్రసాధనే మార్గమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News