: ఒబామా ఆరోగ్యం భేషుగ్గా ఉంది: వైట్ హౌస్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చక్కటి ఆరోగ్యంతో ఉన్నారని, మిగిలిన పదవీ కాలం వరకూ ఆరోగ్యానికి ఢోకా లేదని ఆయన కార్యాలయం వైట్ హౌస్ ప్రకటన జారీ చేసింది. గత నెలలో ఒబామాను వ్యక్తిగత వైద్యుడు రోనీ ఎల్ జాక్సన్ పరీక్షించి వైట్ హౌస్ కు వివరాలు అందించారు. దాంతో ఈ ప్రకటన జారీ అయింది. చివరిగా 2011లో ఒబామా ఆరోగ్యంపై ప్రకటన వెలువడింది. ఆ తర్వాత అలాంటి ప్రకటన ఏదీ లేకపోవడంతో ఒబామా ఆరోగ్యంపై సందేహాలు తలెత్తాయి. దాంతో తాజా ప్రకటన వెలువడింది. ఆరోగ్యకరమైన ఆహారం, రోజూ వ్యాయామం చేస్తూ ఒబామా పొగాకుకు దూరంగా ఉంటున్నారని వైట్ హౌస్ వెల్లడించింది. ఒబామా ఒకప్పుడు సిగరెట్లను బాగా ఊదిపారేసేవారు.