: అవినీతి మంత్రులు ఉండాల్సింది జైల్లో: బాబు


జగన్ అక్రమాస్తుల కేసులో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అవినీతి మంత్రులకు క్యాబినెట్ లో చోటు లేదని, వారు ఉండాల్సింది జైల్లో అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ పాలనలో జరిగిన దోపిడీకి వత్తాసు పలికిన మంత్రులు జైలుకు చేరుతున్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News