: ముగ్గురు ఎంపీలపై చీటింగ్ కేసు
కేంద్ర ప్రభుత్వం కల్పించే ఉచిత ప్రయాణం (ఎల్టీసీ) సదుపాయాన్ని దుర్వినియోగం చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు, మరో ముగ్గురు రాజ్యసభ మాజీ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మోసం, ఫోర్జరీ అభియోగాలతో సెక్షన్ 420, సెక్షన్ 13(1)డి కింద కేసు దాఖలైంది. సిట్టింగ్ ఎంపీలలో తృణమూల్ కాంగ్రెస్ నేత డి.బందోపాధ్యాయ, బీఎస్పీకి చెందిన బ్రిజేష్ పట్నాయక్, మిజో నేషనల్ ఫ్రంట్ కు చెందిన లాల్ మింగ్ లైన ఉన్నారు. మాజీ సభ్యుల్లో బీజేపీకి చెందిన జేపీఎన్ సింగ్, ఆర్జేడీకి చెందిన రేణుబాల, ఆర్ఎల్డీకి చెందిన మెహమూద్ ఏ మద్ని ఉన్నారు. ప్రయాణం చేసినట్లు నకిలీ టికెట్లను సమర్పించి ఆ మొత్తాలను వీరు కాజేసినట్లు ఆరోపణలు మోపారు. వీరిలో ఎక్కువ మంది ఇలా కనీసం మూడు నాలుగు సార్లు చేసినట్లు భావిస్తున్నారు. ఈ స్కాం యూపీఏ హయాంలో వెలుగుచూడగా, ఇప్పుడు తొలిసారిగా కేసు నమోదైంది.