: పోలవరంను త్వరితగతిన పూర్తిచేస్తాం: దేవినేని ఉమా
కేవలం రాజకీయ అవసరాల కోసమే కొంతమంది పోలవరం ఆర్డినెన్స్ పై మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రైతులకు సాగునీటి సదుపాయాన్ని కల్పించడం తమ ధ్యేయమని చెప్పారు. నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని అన్నారు. పనులను పూర్తి చేయకుండానే పులిచింతలను జాతికి అంకితం చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఈ నెల 15న పులిచింతల పనులను పర్యవేక్షిస్తామని చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.