: విశాఖ, విజయవాడ, తిరుపతిలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు
కార్పొరేషన్లుగా ఉన్న నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఐదేళ్లే ఇచ్చారని, దానిని పదేళ్లు చేయాలని కేంద్రాన్ని అడుగుతామన్నారు. బుందేల్ ఖండ్ మాదిరిగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని బాబు చెప్పారు.