: ఐపాడ్.. ఇలా కూడా ఉపయోగపడుతుంది!


యాపిల్ సంస్థ రూపొందించిన అద్భుత ఉపకరణం.. ఐపాడ్. పాటలు, ఫొటోలు.. ఒకటేమిటి, అనేకానేక అప్లికేషన్లతో వాక్ మన్ కు సరికొత్త భాష్యం చెప్పిందీ ఐపాడ్. ఇప్పుడీ ఐపాడ్ తో మరో ఉపయోగం కూడా ఉందండోయ్. అదేంటో చూద్దాం. అప్పుడే పుట్టిన శిశువును చూసి మురిసిపోవడం అనాదిగా తల్లులకు ఎంతో ప్రీతిపాత్రమైన చర్య. అయితే, కొందరు శిశువులకు పుట్టడంతోనే వారికి అత్యవసర చికిత్స అవసరమవుతుంది. అప్పుడు వారిని ఆసుపత్రిలో వేరే ఫ్లోర్లో ఉన్న ఐసీయూల్లోగానీ, ఇంక్యుబేటర్లలోగానీ ఉంచుతారు. అప్పుడు ఆ తల్లి తన శిశువును చూసేందుకు వీల్లేని పరిస్థితుల్లో ఐపాడ్ కొత్త అప్లికేషన్ నేనున్నానంటూ ముందుకొచ్చింది.

ఈ కొత్త పరిజ్ఞానంతో తల్లి ఏ ఫ్లోర్లో ఉన్నా తన శిశువును ఐపాడ్ లో చూసుకోవచ్చట. ఆ శిశువు చేష్టలను వీక్షించడమే కాకుండా.. శిశువుకు వైద్య పరీక్షల వేళ తనవంతుగా డాక్టర్లకు అవసరమైన సమాచారం అందించవచ్చు. ఈ వినూత్న అప్లికేషన్ పేరు 'బేబీ టైమ్'. ఈ నూతన ప్రోగ్రామ్.. శిశువుకు, కుటుంబ సభ్యులకు మధ్య వారధిలా పనిచేస్తుందని అమెరికా వైద్యులు అంటున్నారు.

  • Loading...

More Telugu News