: పరిశ్రమలకు, ఇళ్లకు 24 గంటలు కరెంటును ఇస్తాం: చంద్రబాబు
రాష్ట్రానికి చాలా పరిశ్రమలు వచ్చే అవకాశముందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రాజెక్టులు, పరిశ్రమలు, పోర్టులు రాష్ట్రానికి తెచ్చేందుకు పారదర్శక విధానం అమలు చేయనున్నామని ఆయన తెలిపారు. విద్యుత్ నియంత్రణ వ్యవస్థలు కుప్పకూలాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు లేవని, కరెంటు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని ఆయన అన్నారు. వేరే రాష్ట్రాల నుంచి తీసుకుని అయినా విద్యుత్ ను సరఫరా చేస్తామని ఆయన అన్నారు. పరిశ్రమలకు, గృహావసరాలకు 24 గంటలు కరెంట్ ను ఇస్తామన్నారు. ఎక్కడైనా ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే 24 గంటల్లో మారుస్తామన్నారు. గాలి మరలు, సౌర విద్యుత్తు ద్వారా మరింత కరెంటును అందుబాటులోకి తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు.