: అయోధ్య, వారణాసి, మథుర ప్రాంతాల్లో భద్రత పెంపు


ఉత్తరాదిన అయోధ్య, వారణాసి, మథురలోని మతపరమైన ప్రాంతాలలో పోలీసుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించవచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల సూచన మేరకు ఈ రక్షణ చర్యలు చేపట్టారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఆధ్వర్యంలో పలువురు అధికారులతో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీసుకున్నారు. పలు సీసీటీవీ కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అక్కడి ప్రాంతాల్లో ఫిక్స్ చేశారు. గతంలో అయోధ్య, వారణాసిలో పలు తీవ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో ఈ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News