: వాహనాల పాత నంబర్లు మార్చాల్సిన అవసరం లేదు: కేసీఆర్
తెలంగాణలో వాహనాల పాత రిజిస్ట్రేషన్ నంబర్లను మార్చాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. AP స్థానంలో TS మార్చుకుంటే సరిపోతుందని చెప్పారు. నంబర్లు పాతవే ఉంటాయని, జిల్లా కోడ్ లు మాత్రం మార్చుకోవాలని తెలిపారు. ఈ రోజు ఆయన రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.