: గబ్బర్ సింగ్-2కి పవన్ కల్యాణ్ డైరెక్షన్..?


వరుస పరాజయాల తర్వాత పవన్ కల్యాణ్ కు లభించిన భారీ హిట్ 'గబ్బర్ సింగ్'. పవన్ మళ్ళీ టాలీవుడ్ లో అగ్రస్థానంలో నిలవడంలో ఈ చిత్రం ఎంతో సాయపడింది. అలాంటి బ్లాక్ బస్టర్ ను పవన్ కు ఇచ్చింది యువ దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ కు సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పిన హరీష్ ఇప్పుడు ట్రాక్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. దీంతో, పవర్ స్టార్.. గబ్బర్ సింగ్-2కి అన్నీ తానై వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం ఆ సినిమాకు స్క్రిప్టు తయారుచేసుకుంటున్న పవన్.. దర్శకత్వ బాధ్యతలూ తలకెత్తుకోనున్నాడని టాలీవుడ్ టాక్.

హరీష్ శంకర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ గబ్బర్ సింగ్-2ను తానే ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నాడట. పవన్ కల్యాణ్ గతంలోనూ 'జానీ' చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వం బాధ్యతలు కూడా వహించిన సంగతి తెలిసిందే!

  • Loading...

More Telugu News