: వాయువేగంగా ఇండో చైనా సరిహద్దు రహదారులు, డిఫెన్స్ ప్రాజెక్టులు
భారతదేశ భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన ప్రాంతం ఇండో చైనా బోర్డర్. నిరంతరం చైనా సైనికులు సరిహద్దు నిబంధనలకు తూట్లు పొడుస్తుంటారు. మరోవైపు సరిహద్దు అవతలి వైపు రహదారులను, డిఫెన్స్ బేస్ లను చైనా రెడీ చేసుకుంది. కానీ మన ఘనత వహించిన పాలకులు మాత్రం ఇన్నాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. అయితే దీనిపై మోడీ ప్రభుత్వం దృష్టి సారించింది.
చైనా సరిహద్దుకు సమాంతరంగా భారీ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ రక్షణ శాఖ ప్రాజెక్టులకు ఆగమేఘాల మీద క్లియరెన్సులు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. డిఫెన్స్ కు సంబంధించి పర్యావరణ అనుమతులు అత్యంత కీలకం. గత ప్రభుత్వాల్లో టైమ్ లైన్ (రాష్ట్రాలకు 60 రోజులు, కేంద్రానికి 90 రోజులు) దాటినప్పటికీ అనుమతులు లభించలేదు. కానీ, డిఫెన్స్ కు సంబంధించిన ప్రాజెక్టులకు నిర్ణీత గడువులోగా అనుమతులన్నీ వచ్చేలా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఈ వివరాలను తనతో సమావేశమైన డిఫెన్స్ అధికారులతో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.