: ఈనాడు, ఆంధ్రజ్యోతివి తప్పుడు కథనాలు: తమ్మినేని
ఈనాడు, ఆంధ్రజ్యోతిలు తప్పుడు కథనాలతో దుష్ప్రచారం చేస్తున్నాయని వైకాపా నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. రాజకీయ నేతల వ్యక్తిగత విలువలు మంటగలిసేలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. తన చివరి శ్వాస వరకు జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైకాపాను దెబ్బతీయడానికి ఈ రెండు మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని... లేకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.