: తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు, ఎర్రబెల్లి మధ్య సంవాదం
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. అమరవీరులు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థులను టీఆర్ఎస్ అవమానించిందని ఎర్రబెల్లి తొలి వాగ్బాణం సంధించారు. ఓడిపోయే స్థానాన్ని ఓయూ నేత పిడమర్తి రవికి ఎందుకు కేటాయించారని ఆయన రెండో వాగ్బాణం సంధించారు. కేసీఆర్ సొంత జిల్లాలోని రైతులు మరణిస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. పేద రైతులకు మూడెకరాల భూమి ఎలా సమకూరుస్తారని ఆయన ప్రశ్నించారు.
ఎర్రబెల్లి వ్యాఖ్యలకు సమాధానమిస్తూ మంత్రి హరీష్ రావు, శంకరమ్మపై పోటీకి నిలబెట్టమని చెప్పిన టీడీపీ ఎందుకు మాట తప్పిందని నిలదీశారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా, వ్యవసాయ భూమి ఇస్తామన్నారు. అనంతరం అమరవీరులపై టీఆర్ఎస్ కు అంత ప్రేమ ఉంటే శంకరమ్మను ఎమ్మెల్సీని చేసి పదవి ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.