: సిక్కా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి: నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా నియమితులైన విశాల్ సిక్కా ఆగస్టు ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. నారాయణమూర్తి ఇక నుంచి గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణమూర్తి మాట్లాడుతూ... విశాల్ సిక్కాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్నదని అన్నారు. స్టాన్ ఫోర్ట్ నుంచి పీహెచ్.డి చేసిన విశాల్ సిక్కా నాయకత్వంలో ఇన్ఫోసిస్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆయన ఆకాంక్షించారు.