: విదేశాలకు వెళ్లేందుకు ముషారఫ్ కు అనుమతి
మాజీ దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ విదేశాలకు వెళ్లేందుకు పాకిస్థాన్ లోని కరాచీ కోర్టు అనుమతించింది. ఈ మేరకు 'నో ఫ్లై' లిస్టులో ఆయన పేరు తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు న్యాయవాది తెలిపారు. అయితే, 15 రోజుల తర్వాతే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశం అమలవుతుందని చెప్పారు. అటు తమ ఆదేశంపై పదిహేను రోజుల్లోగా స్పందిస్తూ వ్యతిరేకంగా అప్పీల్ చేసుకోవచ్చని ప్రభుత్వానికి తెలిపింది. 'యూఏఈ'లో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూడడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ముషారఫ్ కోర్టుకు విన్నవించుకున్నారు.