: ఇక బ్లేడ్ అక్కర్లేదు...కాగితంతోనూ గడ్డం గీసుకోవచ్చు!


గడ్డం గీసుకోవడానికి ఇప్పుడు రకరకాల సాధనాలు వినియోగంలోకి వచ్చినా, బ్లేడుకున్న ప్రాధాన్యత మాత్రం బ్లేడుదే! అయితే, ఈ స్టీల్ బ్లేడుల వల్ల పర్యావరణానికి ఎంతో కొంత హానితో పాటు, బ్లేడ్ ఎక్కడ పడేసినా కాస్త ప్రమాదమే! అదే కాగితంతో తయారైన బ్లేడ్ అందుబాటులోకి వచ్చిందనుకోండి... వినియోగానికి, రీ సైక్లింగ్ కి ఏరకమైన ఇబ్బందీ ఉండదు. ఎక్కడ పడేసినా భూమిలో కలిసిపోతుంది. ఇదే ఆలోచన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన నదీం హైదరీకి వచ్చింది.

దీంతో అతను నీటిలో తడవని పేపర్ తో రేజర్ లను తయారు చేసి, దానికి 'పేపర్ కట్' అని నామకరణం చేసేశాడు. చూడటానికి జిల్లెట్ బ్లేడ్ లా ఉండే ఈ 'పేపర్ కట్' రేజర్లు గడ్డం గీసుకోవడానికి బాగా ఉపయోగపడతాయని చెబుతున్నాడు. ప్లాస్టిక్ తో కాకుండా కాగితంతో చేసినందువల్ల ఈ 'పేపర్ కట్' పర్యావరణానికి అనుకూలమైనదని సూచిస్తున్నాడు.

రీసైక్లింగ్ కూడా చాలా సులువంటున్న నదీమ్, భవిష్యత్తులో ప్లాస్టిక్ రేజర్ల స్థానాన్ని ఇది ఆక్రమిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే, ఈ 'పేపర్ కట్' ను చూసుకోకుండా పట్టుకుంటే కనుక చేతులు కోసుకుపోయే ప్రమాదం కూడా ఉందని నదీం హెచ్చరిస్తున్నాడు!

  • Loading...

More Telugu News