: ముగింపు దశకు చేరుకున్న గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో ఆఖరి రోజైన ఇవాళ స్వామి వారికి చక్రస్నాన కార్యక్రమం వైభవంగా జరిగింది. అంతకు ముందు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, తేనె, నారికేళ జలంతో అభిషేకించి కర్పూర హారతులు సమర్పించారు. ఇవాళ రాత్రి జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.