: వీకెండ్ లో రూ. 19 కోట్లు కొల్లగొట్టారు..!
'చష్మే బద్దూర్'.. బాలీవుడ్ లో ప్రస్తుతం ఎవరినోట విన్నా ఇదే మాట. అలనాటి హిట్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి రీమేక్ అయిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. కథాంశం పరంగానూ, వసూళ్ళ పరంగానూ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ నాటికి రూ. 19 కోట్లు వసూలు చేసి బాక్సాఫీసును షేక్ చేస్తోంది. చష్మే బద్దూర్.. శుక్రవారం రూ. 5.18 కోట్లు, శనివారం రూ. 6.17 కోట్లు, ఆదివారం రూ. 7.75 కోట్లు రాబట్టడంతో నిర్మాతలు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారట. ఈ సినిమాలో సిద్ధార్థ్, తాప్సీ, అలీ జాఫర్, దివ్యేందు శర్మ నటించారు. కామెడీ చిత్రాల దర్శకుడు డేవిడ్ ధావన్ డైరక్షన్ లో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది.