: రక్షక భటులు కాదు... భక్షక భటులు
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో రక్షక భటులే భక్షకులుగా మారి ఓ వివాహితపై విరుచుకుపడ్డారు. హమీర్ పూర్ జిల్లాలోని సుమేర్ పూర్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ నిర్బంధంలో ఉన్న తన భర్తను కలిసేందుకు వెళ్లిన వివాహితపై పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సహా, పలువురు కానిస్టేబుళ్లు స్టేషన్ లోనే కీచకుల్లా మారి ఆమెను బలాత్కరించారు. కనికరించమని వేడుకున్నా ఆమెపై కరుణ చూపలేదు. ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేయడంతో ఎస్ హెచ్ వో అరెస్టయ్యాడు. కానిస్టేబుళ్లు పరారీలో ఉన్నారు.