: ఈ రోజు రెండో మృతదేహం లభ్యం


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది లో మరో తెలుగు విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ ఉదయం ఒక విద్యార్థి మృతదేహం లభించగా, ఆ తర్వాత గాలింపు చర్యల్లో మరొకటి లభ్యమైంది. వాటిని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన తల్లాడ ఉపేందర్, అరవింద్ మృతదేహాలుగా గుర్తించారు. తమ కొడుకు శవాన్ని చూసిన ఉపేందర్ తల్లిదండ్రులు సంఘటనా స్థలంలో గుండెలు పగిలేలా రోదించారు. మిగిలిన 16 మంది విద్యార్థుల ఆచూకీ కోసం నేవీ సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఈ రోజు బియాస్ నది వద్దకు చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ కూడా బాధిత కుటుంబ సభ్యులకు సహకారం అందించేందుకు అక్కడే ఉన్నారు.

  • Loading...

More Telugu News