: బీజేపీకి ఇంతటి విజయం ఎలా సాధ్యమైంది?: రాహుల్ ఆరా


లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అఖండ విజయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి దిమ్మ తిరిగేలా చేసినట్లుంది. చరిత్రలో మొదటి సారిగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన వాటి కంటే ఎక్కువ స్థానాలను సాధించి బీజేపీ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలుసు. ఇదెలా సాధ్యమైందన్నదే రాహుల్ కు అంతుబట్టడం లేదు. నిన్న లోక్ సభలో తనకు సమీపంలోనే కూర్చున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సౌగతారాయ్, కకోలి ఘోష్ తో రాహుల్ ఇదే విషయమై ఆరా తీశారు.

16వ లోక్ సభలో బీజేపీకి ఇంతటి బలం ఎలా సాధ్యమైంది? ఉత్తరప్రదేశ్ లో మత అంశాలు ప్రభావం చూపాయా? ఇక్కడి నుంచి బీజేపీ తరపున 70కి పైగా ఎంపీలు ఉండగా... వారిలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం గురించి వారి అభిప్రాయం తెలుసుకునేందుకు రాహుల్ ఆసక్తి చూపారు. అలాగే పశ్చిమబెంగాల్లో బీజేపీ బలీయమైన శక్తిగా మారే అవకాశం ఉందా? అని కూడా రాహుల్ అడిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం పెరగడాన్ని రాహుల్ ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News