: ఆమెపై అత్యాచారం చేసి ఉరేశారా?


అరాచకాల ఉత్తర ప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. మొరాదాబాద్ జిల్లాలో ఈ ఉదయం చెట్టుకు వేలాడుతూ 19 ఏళ్ల యువతి కన్పించింది. గత ఇరవై రోజుల్లో యూపీలో ఇది మూడో సంఘటన. నిన్న ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఉరేశారు దుండగులు. అది గడిచి 24 గంటలు కూడా ముగియకముందే మొరాదాబాద్ లోని ఠాకూర్ ద్వారా ప్రాంతంలో 19 ఏళ్ల యువతి శవం చెట్టుకు వేలాడుతూ కన్పించింది.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం అత్యాచారం చేసి హత్య చేశారా?, లేక, హత్యా? అన్నది తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News