: ప్రేమ...పెళ్లి...అంతా ఉత్తిదే... ఆటలో అరటిపండు


ఇంజనీరింగ్ చదివిన ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం కలసి కాపురం కూడా చేశారు. ఒంటరి జీవితం ఎంత కష్టమన్న విషయం అవగతమైందో, లేక, ప్రేమించినప్పటి రంగుల కల వాస్తవంతో కరిగిపోయిందో కానీ, జరిగిందంతా ఆటలో అరటిపండులా భావించి, అతనిని వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్య తనను మోసం చేసిందంటూ రచ్చకెక్కాడు ఆ యువకుడు. కృష్ణా జిల్లా విజయవాడలోని కానూరుకు చెందిన ఓ యువకుడు ఇంజనీరింగ్ చేస్తూ పోరంకికి చెందిన సహవిద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగం సంపాదించాడు. వీరిద్దరూ జనవరిలో గుణదలలో వివాహం చేసుకున్నారు.

కొంత కాలం కలిసి కాపురం చేసిన తరువాత, భర్తతో కాపురం చేయనని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్య తనను మోసం చేసి, మరో వ్యక్తిని వివాహం చేసుకుంటోందని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులను పిలిచి విచారణ జరిపారు. దీంతో తనను అతను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, తనకి ఆ పెళ్లి ఇష్టం లేదని ఆమె పోలీసులకు తెలిపింది. మేజర్లు కనుక, వారివారి వ్యక్తిగత జీవితాలపై నిర్ణయం తీసుకునే హక్కు ఇద్దరికీ ఉందంటూ పోలీసులు సర్ది చెప్పి పంపేశారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని సూచించారు.

  • Loading...

More Telugu News