: హైదరాబాదులో 'ప్రపంచ పర్యాటక సదస్సు': చిరంజీవి
త్వరలో హైదరాబాదులో 'ప్రపంచ పర్యాటక సదస్సు' నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి కె.చిరంజీవి తెలిపారు. ప్రపంచ 'పర్యాటక రంగం-భవిష్యత్' అంశంపై ఇందులో చర్చిస్తామని చెప్పారు. శ్రీనగర్ లో జరగాల్సిన పర్యాటక సదస్సు హైదరాబాద్ లో నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించానన్నారు. సదస్సు ద్వారా భారత పర్యాటక రంగ అందాలు ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందన్న చిరంజీవి సదస్సును విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.
నగరంలో జూబ్లీహాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన శాఖ అధికారులతో కలిసి మంత్రి మాట్లాడారు. తనపై నమ్మకంతో పర్యాటక శాఖ బాధ్యతలను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మన్మోహన్ అప్పగించారని చెప్పారు. పర్యటక రంగం ద్వారా దేశానికి ఏం చేయాలో తెలుసుకుంటున్నానన్నారు. ఈ శాఖ ద్వారానే దేశానికి ఆర్ధికంగా మేలు, ఎక్కవమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.