: చంద్రబాబు ముందు చూపు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి ఎంతో పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు శాఖల కేటాయింపులో ఆ దిశగానే అడుగులు వేసినట్లు కనిపిస్తోంది. నిన్న మంత్రులందరికీ శాఖలు కేటాయించిన ఆయన... కీలక శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యుత్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. ఇవి కాక న్యాయ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలను కూడా ఎవరికీ కేటాయించలేదు.

  • Loading...

More Telugu News