: ఇన్ఫోసిన్ సీఈవో అండ్ ఎండీగా విశాల్ సిక్కా
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సీఈవో అండ్ ఎండీగా విశాల్ సిక్కా నియమితులయ్యారు. ఆగస్టు 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న నారాయణమూర్తి అక్టోబర్ 11 నుంచి గౌరవాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. సీవోవోగా యూబీ ప్రవీణ్ రావు నియమితులయ్యారు. నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి ఈ నెల 14న ఇన్ఫోసిస్ నుంచి వైదొలగనున్నారు.