: అశ్రునయనాలతో దేవాశిష్ బోస్ కు తుది వీడ్కోలు
హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి దేవాశిష్ బోస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం హైదరాబాదు బాగ్ అంబర్ పేటలోని సీఈ కాలనీ నుంచి గన్ ఫౌండ్రీలోని కేథలిక్ చర్చి వరకు అంతియ యాత్ర సాగింది. ఈ యాత్రలో దేవాశిష్ స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం కింగ్ కోఠీలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.