: పోలవరంపై ఆర్డినెన్స్ జారీని తప్పుపట్టిన అసదుద్దీన్ ఒవైసీ
లోక్ సభలో హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. పోలవరం ముంపు గ్రామాలపై ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. మూడు రాష్ట్రాలతో వివాదం ఉన్నప్పుడు పోలవరం ముంపు గ్రామాలపై ఏకపక్షంగా ఆర్డినెన్స్ ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఆర్డినెన్స్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఒవైసీ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ సభ్యులు మద్దతు పలుకగా, ఆంద్ర ప్రదేశ్ టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు.