: తిరుపతి రైల్వేస్టేషన్ కు మంచి రోజులు !
త్వరలో తిరుపతి రైల్వే స్టేషన్ కు మంచి రోజులు రానున్నాయా? అవుననే చెబుతున్నారు టీటీడీ అధికారులు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తరహాలో తిరుపతి రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, రైల్వే అధికారి తేజ్ పాల్ సింగ్ చెప్పారు. తిరుపతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు ముగ్గురూ మాట్లాడారు. టీటీడీకి చెందిన గోవిందరాజుస్వామి సత్రాల్లో 2,3 సత్రాలను రైల్వేస్టేషన్ అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు. భక్తుల కోసం సత్రాల నుంచి విష్ణు నివాసం వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని వెల్లడించారు.