: ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీగా ఆర్పీ ఠాకూర్, పోలీసు సంక్షేమ అదనపు డీజీపీగా కౌముది బదిలీ అయ్యారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీపీగా సురేంద్రబాబు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీగా అనూరాధ, సీఐడీ అదనపు డీజీపీగా ద్వారకా తిరుమలరావు ట్రాన్స్ ఫర్ అయ్యారు.