: రాజీవ్ పై వికీలీక్స్ నివేదిక పూర్తిగా నిరాధారం: కాంగ్రెస్
స్వీడిష్ కంపెనీకి మధ్యవర్తిగా రాజీవ్ గాంధీ వ్యవహరించారంటూ సంచలనం సృస్టిస్తున్న యూఎస్ కేబుల్స్ ద్వారా వెలువడిన వికీలీక్స్ కథనాన్ని కాంగ్రెస్ ఖండించింది. వికీలీక్స్ నివేదికలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవాలనీ పార్టీ అధికారి ప్రతినిధి జనార్ధన్ ద్వివేది అన్నారు. కాగా, ఈ కథనాన్ని ప్రచారం చేసిన మీడియాపై స్పందిస్తూ.. వికీలీక్స్ కథనం ఆధారంగా ఓ వర్గం మీడియా గాంధీ కుటుంబంపై ప్రశ్నలు లేవనెత్తడం బాధాకరమన్నారు. మరోవైపు, వికీలీక్స్ కథనంపై కాంగ్రెస్, ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ డిమాండ్ పైనా ద్వివేదీ మండిపడ్డారు. భారత రాజకీయాలను బీజేపీ నేతలు ఎక్కడికి తీసుకువెళ్లాలనుకుంటున్నారని ప్రశ్నించారు.