: తెలంగాణ అసెంబ్లీ ఉపసభాపతి పదవికి పద్మాదేవేందర్ రెడ్డి నామినేషన్
తెలంగాణ అసెంబ్లీ ఉపసభాపతి పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాగా, డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు కోరారు. కానీ, తాము ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించామని, ఇప్పుడు మార్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దీనిపై భవిష్యత్తులో పరిశీలిస్తామని సీఎం చెప్పారు. దాంతో, ఉపసభాపతి ఎన్నిక వ్యవహారం ముగిసింది.