: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం


శాసనసభ కమిటీ హాల్ లో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం అయింది. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని కోరుతున్న టీ కాంగ్రెస్ దీనిపై చర్చిస్తోంది. కాగా, పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం మధ్యలోనే వచ్చేశారు. తెలంగాణలో పార్టీ పరాజయానికి కారణమై, ఎన్నికల్లో ఓడిపోయిన పొన్నాల రాజీనామా చేయకుండా, తమ సమావేశానికి రావడం ఏమిటి? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఓటమికి పొన్నాల, ఉత్తమ్ లదే బాధ్యత అని అన్నారు. గెలిచే సత్తాలేని వారికి టికెట్లు ఇచ్చి పార్టీని నాశనం చేశారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News