: ఓయూ, ద్రవిడ విశ్వవిద్యాలయ పరీక్షలు వాయిదా
విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా వామపక్షాలు మంగళవారం రాష్ట్ర బందుకు పిలిపునిచ్చిన నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. అలాగే, చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో జరగవలసిన అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆ యూనివెర్సిటీ రిజిస్ట్రార్ పి.ఆదినారాయణ తెలిపారు. ఈనెల 30న వీటిని నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు వామపక్షాల బంద్ కు టీఎన్జీవో నేతలు మద్ధతు తెలిపారు.