: ఆస్టిన్ లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ
అమెరికాలోని ఆస్టిన్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ, విజయోత్సవ సభ, ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటం వద్ద రాయపాటి సుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం రఘు దొప్పలపూడి, బాలాజీ నాయుడు, ఉమాపతి తదితరులు ప్రసంగించారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి, ఎంపీ, ఎమ్మెల్యేలకు వారు అభినందనలు తెలిపారు. ఆస్టిన్ ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ కోటపాటి, సదా చిగురుపాటి, సాంబ వెలమ, కృష్ణ ధూళిపాళ్ల, వీర లెనిన్ తుళ్లూరి, లెనిన్ యెర్రం, చందు బొంత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.