: గవర్నర్ ప్రసంగం చాలా చప్పగా ఉంది: డాక్టర్ లక్ష్మణ్


తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశాల నేపథ్యంలో, ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ చేసిన ప్రసంగం చాలా చప్పగా ఉందని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ పెదవి విరిచారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న విషయాలనే గవర్నర్ తో మరోసారి చదివించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ ప్రకటనలపై స్పష్టత వస్తుందని ఆశించామని... అయితే ఎలాంటి స్పష్టత రాలేదని అన్నారు. రైతు రుణ మాఫీల అంశాన్ని ప్రస్తావించారని... అయితే రుణమాఫీ ఎలా చేస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ ప్రజలు నిరాశకు గురయ్యారని అన్నారు.

  • Loading...

More Telugu News