: తిరుపతిలోని ఓ షాపులో అగ్నిప్రమాదం


తిరుపతిలోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. చిన్నబజారు వీధిలోని ఓ షాపులో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో సమీపంలో ఉన్న దుకాణదారులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన దుకాణ యజమానిని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News