: మోడీని కలిసే యోచనలో కేజ్రీ
వారిద్దరూ లోక్ సభ ఎన్నికల్లో వారణాసి స్థానంలో ముఖాముఖి తలపడ్డారు. ఒకర్ని విజయం వరించి, ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. మరొకర్ని అపజయం పలకరించి మరింత సమస్యల్లోకి నెట్టింది. వారే నరేంద్రమోడీ, అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు వారిద్దరూ కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో తీవ్రంగా మారిన విద్యుత్ సంక్షోభ సమస్య పరిష్కారానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్... ప్రధాని మోడీని కలవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇదింకా ఖరారు కాలేదు.