: తిరుపతిలో యోగా సెంటర్: రాందేవ్ బాబాకు బాబు సూచన
తిరుపతిలో అతి పెద్ద యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. చంద్రబాబును ఆయన నివాసంలో రాందేవ్ బాబా కలిశారు. తిరుపతిలో యోగా కేంద్రంతో పాటు, తిరుమలలో 40 వేల ఔషధ మొక్కలను నాటాలని బాబు కోరారు. సమావేశం అనంతరం రాందేవ్ బాబా మీడియాతో మాట్లాడుతూ... తిరుపతిలో పతంజలి ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగా కేంద్రాన్ని ప్రారంభించాలన్న సూచనను పరిశీలిస్తానని అన్నారు.