: టీవీ కళాకారుల దీక్షకు కవిత పరామర్శ
డబ్బంగ్ సీరియళ్లను నిషేధించాలని డిమాండు చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న టీవీ కళాకారులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా వారి దీక్షలకు సంఘీభావం తెలిపారు. తెలుగు టీవీ పరిశ్రమలో కళాకారుల పరిస్థితిని గుర్తించి టీవీ యాజమాన్యాలు డబ్బింగ్ సీరియళ్లను నిలిపి వేయాలని కవిత డిమాండు చేశారు. కాగా, కళాకారులు చేస్తున్న దీక్షలు నేటితో 8వ రోజుకు చేరాయి.