: లార్జి జలాశయం వద్ద మరో విద్యార్థి మృతదేహం లభ్యం


హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన వారిలో మరొకరి మృతదేహం లభించింది. లార్జి జలాశయం వద్ద రక్షణ సిబ్బంది ఒక మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మృతదేహం ఎవరిదనేది ఇంకా గుర్తించాల్సి ఉంది. దీంతో ఈ ఘటనలో గల్లంతైన వారిలో ఇప్పటివరకు ఆరు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మరో వైపు గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. లార్జి జలాశయ సిబ్బంది నిర్లక్ష్యంపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముగ్గురు లార్జి జలాశయ సిబ్బందిని సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News